గుజరాత్ టైటాన్స్ కు 163 రన్స్ టార్గెట్ నిర్దేశించిన ఢిల్లీ క్యాపిటల్స్

  • ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టైటాన్స్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసిన ఢిల్లీ
  • రాణించిన అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, వార్నర్, పోరెల్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. తడబడుతూనే బ్యాటింగ్ చేసిన కెప్టెన్ వార్నర్ 37 పరుగులు చేశాడు. ఓపెనర్ పృథ్వీ షా (7), ఆల్ రౌండ్ మిచెల్ మార్ష్ (4), రిలీ రూసో (0) విఫలమయ్యారు. 

సర్ఫరాజ్ ఖాన్ 30, అభిషేక్ పోరెల్ 20 పరుగులు చేయగా, ఆఖర్లో అక్షర్ పటేల్ దూకుడుగా ఆడడంతో ఢిల్లీ స్కోరు 150 మార్కు దాటింది. అక్షర్ పటేల్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ పోరెల్ 2 సిక్సులు బాదాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ 3, రషీద్ ఖాన్ 3, అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీశారు.

Delhi Capitals
Gujarat Titans
Target
IPL

More Telugu News